అద్దాల మేడల్లో ట్యూబులైటు వెలుగుల్లో
జీతానికి జీవితానికి మధ్యలో మన ప్రయాణం
కాంక్రీటు గోడల మధ్య కట్టెయ్యని బానిసలం
రాత్రి పగలు తేడా తెలియని మర మనుషుల ప్రతిరూపాలం
డాలర్ల వేటలో దేశాలైన దాటేస్తాం
రూపాయల రూపంలో అమ్మకి ప్రేమని పంపిస్తాం
విదేశీమారకానికి మారే విలువల్లేని జీవులం
వేలంపాటలో అమ్మబడే కార్పొ"రేటు" వేశ్యలం
పరదేశపు సంస్కృతినే పరమావధి చేసుకొని
మాతృభాషనే మనం నామోషీ అనుకుంటాం
వారాంతపు సెలవులకి వలస వెళ్లే పక్షులం
మిగిలిన ఐదు రోజులు కార్యాలయానికి "కట్టప్ప"లం
EMI ల రూపంలో జీవితాన్ని తాకట్టెట్టి
రానూపోనూ రైలుబండిలో రివాజుగా కుస్తీపట్టి
జీవితపు అనుభవాలు క్యాలండరులో కట్టిపెట్టి
కార్యాలయపు కష్టాలన్నీ పంటికింద బిగపెట్టి
అంధకారపు బందిఖానాలో సంకెళ్లు వెయ్యని మిత్రమా
ఏదేదో చెయ్యాలని ఎందుకంత ఆత్రమోయ్ ...!!!
-రాజు వెలగందుల