Sunday, January 15, 2017

నవజీవన సమాజం


పరుగెడితే వెంటవచ్చి , వెనకబడితే నిన్ను వదలి
నిలబడితే నిన్ను తలచి, పడిపోతే నిన్ను మరచె
నవజీవన సమాజం

సకార్యమే పాపముగా , స్వలాభమే ఊపిరిగా
మంచి పనియే వంచనగా, చెడు చేసే
నవజీవన సమాజం

దీనికన్నా శవం నయం
దీనికన్నా శవం నయం ....!!

పరిచయ వాఖ్యాలు

ఎల్లరికి వందనాలు .

చాలా  రోజుల  నుండి  తెలుగు భాషలో  బ్లాగ్  రాయాలని  ఒక  ఆలోచన  . ఇన్ని  రోజులకి  సమయం  మరియు  సందర్భం  వొచ్చిందని   భావించి  ఈ  బ్లాగుకి  శ్రీకారం చుట్టడం జరిగింది.

ఈ బ్లాగుకి నామకరణం "శకునిమామ" అని పెట్టడం వెనక ఆంతర్యం ఏమిటంటే , సినిమాల ప్రభావం వల్ల మనకి వ్యక్తిత్వం పైన అనేక అపోహలు ఏర్పడ్డాయి కానీ మహాభారతంలో శ్రీకృషుని తర్వాత అచంచల తెలివితేటలు మరియు భావనిగ్రహం కలిగియున్న ఏకైక వ్యక్తి శకుని .

ఏది ఏమైనా, నా భావాలని వ్యక్తీకరించడానికి శకునుణ్ణి మధ్యవర్తిగా ఎంచుకోవడం జరిగింది . రానున్న రోజుల్లో ఈ వేదికపై అనేక విషయాల పట్ల నా పరిశీలన మరియు నా వ్యాఖ్యానం వ్యక్తీకరించనున్నాను . మన చుట్టూ ఉన్న నలుగురి ఆలోచనల్లో మార్పు తీసుకు రావడం , మన భాషలో పట్టు కోల్పోకుండా ఉండటం అనేది ఈ నా వ్యాసాల ముఖ్య ఉద్దేశం.